ఇంకెంత కాలం వాచావాత్సల్యం

రైతులను బలిగొంటున్నకల్తీ వ్యాపారులు

Cultivation
Cultivation

వ్యవసాయం లాభసాటిగా ఉంటే ఒక ఏడాది నష్టం వచ్చినా తట్టుకోగలరు. ఎంత పండిస్తే అంత నష్టం వచ్చే దురదృష్టపరిస్థితులు దాపురించాయి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా గిట్టుబాటు ధర కల్పించడం, కల్తీని నివారించడం పాలకుల పరిధిలోఉంది.

సంపాదన ఆరాటంలో కల్తీ వ్యాపారులు చేస్తున్న ఈ ఆరాచకాన్ని నిలవరించలేక పోవడం దురదృష్టకరం. పాలకులు రైతులపై చూపుతున్న వాచావత్సల్యంలో పదోవంతు చేతల్లో చూపితే అన్నదాతల ప్రాణాలను బలిగొంటున్న ఈ కల్తీ వ్యాపారులను కట్టడి చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

‘తల్లిగర్భం నుండి ధనం తేడెవ్వడు, వెళ్లిపోయేనాడు వెంట రాదు, లక్షాధికారి అయినా లవణమన్నమేకానీ మెరుగు బంగారంబు మింగబోదు,విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి ధానధర్మలు లేక దాచిదాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవ్ఞనో తేనె జుంటీగలు ఇయ్యవా తెరువరులకు.. అని నర్సింహ శతకకారుడు ఏనాడో చెప్పారు.

ఇందులోని పరమార్థం పట్టించుకునేవారు రానురాను తగ్గిపోయారు. డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా జీవనం సాగించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతున్నది. ఈ పోటీలో మానవతా విలువలు, నైతిక విలువలు అడుగంటిపోతున్నాయి.స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటి పోయినా లక్షలాదికోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఆఫలాలు ఇంకా చేరవలసిన వారికి చేరడం లేదు.

కోట్లాది ధనం ఏమైపోతున్నదో, లోపం ఎక్కడ ఉన్నదో, ఎవరిలో ఉన్నదో సామాన్యులకు అర్థం కావడం లేదు. వ్యవసాయమే ఏకైక జీవనాధారంగా గ్రామాల్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్న కల్లాకపటం ఎరుగని కోట్లాది మంది రైతులపై ఈ భారం పడుతున్నది. భూమిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరనేది పాతకాలపు నమ్మకంగా మారిపోయింది.

గ్రామాల్లో ఉంటూ భూమిపైనే ఆధారపడుతూ వ్యవసాయమే జీవ నాధారంగా బతకడం ఒక శాపంగా పరిణమిస్తున్న దురదృష్టపు రోజులు దాపురించాయి. ఒకపక్క ప్రకృతి సహాయనిరాకరణ, మరొకపక్క తోటి మనిషి చేస్తున్న దగా దోపిడీతో రైతు కుదేలై పోతున్నాడు. విత్తే దగ్గర నుంచి విక్రయించే దాకా రైతు అనేక మోసాలకు గురవ్ఞతున్నాడు.

మరో జీవనోపాధి లేక, రాక, ఏ అవకాశం లేకనే గ్రామాల్లో ఉంటున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా వ్యవసాయాన్ని గ్రామాలను వదిలిపెట్టి పట్టణాల బాట పట్టేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు తాము నమ్ముకున్న వ్యవసాయాన్ని, పుట్టిపెరిగిన ఊరును వదిలిపెట్టి పట్టణాలు, నగరాల బాటపట్టారు.

కరోనా ఉధృతి ఆరంభంలో లాక్‌డౌన్‌ సమయంలో ఎన్ని కోట్ల మంది వ్యవసాయ కూలీలు, రైతులు వలసలు వెళ్లారో బయటపడింది.ఈ వలసలతో నగరాలపై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం. వ్యవ సాయం రానురాను కుదేలైపోతున్నది. ప్రకృతి కూడా రైతులపై పగబట్టిందేమోనన్నట్టుగా వ్యవహరిస్తున్నది.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయరంగాన్ని అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోట్లాది రూపాయల విలువైన పంటలు నీట మునగడంతో రైతులు కోలుకోలేకపోతున్నా రు. అలాని పాలకులు వ్యవసాయంపట్ల ఏమి చేయడం లేదని చెప్పడంలేదు. అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది కోట్లు వెచ్చిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక అడుగు ముందుకువేసి వ్యవసాయానికి అగ్రపీఠం వేసిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.

వాస్తవంగా ఇది రైతులకు ఎంతో ఊరటనిస్తున్నది. మరొకపక్క సబ్సిడీతో వ్యవసాయపరికరాలు అందించే కార్యక్రమం ఏనాటి నుంచో కొనసాగుతున్నది. ఇది, అది అని కాదు. రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకట నలమీద ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతు న్నట్లు వార్తలు అందుతున్నాయి.

2022 నాటికి రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామని ఏనాడో ప్రకటించారు. మొన్న సోమ వారం పార్లమెంటు సమావేశాల్లో రైతులు తమ పంటలనుదేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా వీలు కల్పించడంతోపాటుమరికొన్ని సౌకర్యాలతో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఇది రైతులకు ఎంతో చేయూతనిస్తుందని ప్రధానమంత్రి, మంత్రులు, చెప్పుకున్నారు.

అయితే ఇది రైతులకు నష్టదాయకమని కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు అంటున్నాయి.అకాలీదళ్‌ సభ్యురాలు ఏకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. రుణమాఫీ లాంటి పథకాలు కూడా గతంలో ఎన్నో ప్రవేశపెట్టారు.ఇంతచేస్తున్నా,ఇన్ని ప్రోత్సా హకాలు ఇస్తున్నా రైతుల పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవ్ఞ. రోజురోజుకు రైతు కృంగిపోతున్నాడు.

ఎందుకు జరుగుతు న్నది ఇది?మూలాల్లోకి ఎందుకు వెళ్లడం లేదు?అసలు పాలకులు ఇస్తున్న సబ్సిడీలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రక టిస్తున్న వందలాది కోట్లరూపాయల్లో రైతులకు ఏమేరకుసహాయం అందుతున్నది.తదితర విషయాల జోలికి వెళ్లుతున్నట్లుకన్పించదు. అన్నింటికంటే ముఖ్యంగా రైతులకు కావాల్సిన రుణసదుపాయం అందించడంలో విఫలమవుతున్నారనే చెప్పొచ్చు.

బ్యాంకుల దయా దాక్షిణాల్యపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని గతంలో కేంద్ర వ్యవసాయశాఖ నిర్వహించిన సామాజిక, ఆర్థిక అధ్యయనంలో వెలుగుచూసింది.నేషనల్‌ శాంపిల్‌ సర్వేఆర్గనైజేషన్‌ నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల్లో రైతులు అగ్రస్థానంలో ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కోటి నలభైలక్షలకుపైగా గ్రామీణ కుటుం బాలు ఉంటే వాటిలో నలభైశాతంపైగా రైతాంగ కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఎనభైశాతం పైగా అప్పులబారినపడి కృంగిపోతున్నారు.జాతీయ స్థాయిలో కంటే రెట్టింపులో తెలుగురాష్ట్రాల్లో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.

ఇప్పటికీ రైతులు చేస్తున్న ప్రతి వెయ్యి రూపాయల అప్పులో సగానికిపైగా వడ్డీ వ్యాపారుల నుంచే తెచ్చుకుంటున్నారు.ఇక వడ్డీల విషయం చెప్పాల్సిన పని లేదు. నలభైఐదు శాతం మందికిపైగా రైతులకు సాధారణవడ్డీకి అప్పు లభిస్తుండగా మిగిలినవారికి పన్నెండు శాతంనుంచి ముప్ఫై శాతంవరకు చక్రవడ్డీలకు తెచ్చుకుంటున్నారు.

ఇలాంటివి గమనించే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రైవేట్‌ అప్పులపై మారిటోరియం విధించింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అలా చర్యలు తీసుకోవడంతో అప్పులు దొరకక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కొంతకాలంమైక్రోఫైనాన్స్‌కంపెనీలు రైతుల అవసరాన్ని తమ వ్యాపారానికి ఉపయోగించుకున్నాయి. రైతులకు రుణసహాయం అందించడం కోసమే ఏర్పడిన సహకార సంస్థలు, రాజకీయ ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే వ్యవసాయరంగాన్ని నకిలీ నాసిరకం విత్తనాలు సంక్షోభం వైపు నెట్టివేస్తూ అన్నదాతల ప్రాణాలతో ఆటలాడుతు న్నాయి. ఈ నకిలీ నాసిరకం మందులను అరికట్టడంలో గత పాలకులతోపాటు ఇప్పటి ప్రభుత్వాలు కూడా విఫలమవ్ఞతున్నదే మోననిపిస్తున్నది. ఆశ అత్యాశగా మారి దురాశగారూపాంతర చెందితే సమాజంపై పడుతాయో వేరే చెప్పక్కరలేదు.

ఆ పరిణామాలు లోకం పోకడ తెలియని అమాయక బక్క రైతులపై పడు తున్నది. వ్యవసాయానికి మూలం విత్తనాలు అనేది అందరికి తెలిసిందే.ఆ విత్తనాల్లో కల్తీ జరిగి నాసిరకమో లేక ఏకంగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే అవి విత్తిన రైతుల పరిస్థితి మాటల్లో వర్ణించలేం.

తల తాకట్టుపెట్టి అప్పోసొప్పో చేసి పెట్టుబడి పెట్టి నెలల తరబడి రాత్రింబవళ్లు ఇంటిల్లిపాది కాయకష్టం చేసి పంట నోటికందుతున్న దశలో తాము వేసింది నకిలీ విత్తనాలని,తాము మోసపోయామని తెలిస్తే ఆ రైతేకాదు ఆయన కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది.ఏమిచేయాలో దిక్కుతోచదు.

ఎవరు ఆదుకొం టారో అర్థంకాదు.పంటకోసం చేసినఅప్పులు ఎలాతీర్చాలో ఆలోచ నలకు అందని పరిస్ధితి.ఇంకో పక్క అప్పులవారి ముందు ఆత్మాభి మానం చంపుకొని తలవంచుకొని నిలబడలేక ఆత్మహత్యలకుపాల్ప డుతున్నారు.ఇక క్రిమిసంహారకమందుల్లో కల్తీ,ఎరువ్ఞల్లో కల్తీ, తది తరవి కూడా రైతులఆత్మహత్యలకు కారణాలవ్ఞతున్నాయి.

గిట్టు బాటుధర కూడా పెద్దసమస్యే.కూలీల రేట్లనుండి అన్నిధరలు పెర గడం పెట్టుబడి అందుకోలేనంతగా ఎగబాకింది. దీంతో ఖర్చులు పెరిగి రాబడితగ్గి అప్పులపాలవ్ఞతున్నారు. వ్యవసాయం లాభసా టిగా ఉంటే ఒకఏడాది నష్టంవచ్చినా తట్టుకోగలరు.ఎంత పండిస్తే అంతనష్టం వచ్చే దురదృష్టపరిస్థితులు దాపురించాయి.

మిగిలిన విషయాలు ఎలాఉన్నా గిట్టుబాటుధర కల్పించడం,కల్తీని నివారించ డం పాలకుల పరిధిలోఉంది.సంపాదన ఆరాటంలో కల్తీ వ్యాపా రులు చేస్తున్న ఈ ఆరాచకాన్ని నిలవరించలేకపోవడం దురదృష్టకరం.

పాలకులు రైతులపై చూపుతున్న వాచావాత్సల్యంలో పదో వంతు చేతల్లో చూపితే అన్నదాతల ప్రాణాలను బలిగొంటున్న ఈ కల్తీ వ్యాపారులను కట్టడిచేయడం పెద్దకష్టం కాకపోవచ్చు

-దామెర్ల సాయిబాబ

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/