టిడిపి నిజాయితీ గల పార్టీ

చంద్రబాబు నాయుడుపై ఎలాంటి అవినీతి ముద్ర లేదు

buddha venkanna
buddha venkanna

మంగళగిరి: టిడిపి నిజాయితీ గల పార్టీ అని సిట్‌కు భయపడమని..ఎలాంటి విచారణను అయినా తాము ఎదుర్కొంటామని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుపై ఎలాంటి అవినీతి ముద్రలేదన్నారు. శనివారం బుద్దావెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలు, కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. ఇసుక, లిక్కర్‌, పెన్షన్లపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. 2024లో మళ్లీ టిడిపి ప్రభుత్వం వస్తుందని…అప్పుడు మా టైం వస్తుందని బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/