కరోనాతో విలవిలలాడుతున్న అగ్రరాజ్యం
24 గంటల్లో పదివేల కొత్తకేసులు, 130 మరణాలు

న్యూయార్క్: కరోనా బారిన పడి అగ్రరాజ్యం విలవిల లాడుతుంది. కేవలం24 గంటలలోనే అమెరికాలో పదివేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితొ యూఎస్‌లో భాధితుల సంఖ్య 49,594కు చేరింది. నిన్న ఇక్కరోజులోనే 130 మంది ఈ వైరస్ వల్ల మృతి చెందారు.దీనితో మృతుల సంఖ్య 622 కు చేరింది. కాగా నిన్న ఒక్కరోజు నమోదు అయిన కేసులలో 5085 కొత్త కేసులు కేవలం న్యూయార్క్ నగరంలోనే నమోదు కావడం గమనార్హం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/