నేడు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కమిషన్ పై హైకోర్టులో విచారణ

TS High Court
TS High Court

హైదరాబాద్‌ః దిశ ఎన్ కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. నేడు రాష్ర్ట ప్రభుత్వం తన వాదనలను హైకోర్టులో వినిపించనుంది. ఎన్ కౌంటర్ కు గురైన వారి కుటుంబ సభ్యుల తరపు వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ర్టక్షన్ పేరుతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని కోర్టులో తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/