మోడీ కేంద్ర వర్గంలో తెలుగు రాష్ట్రాల నుండి 5 గురికి ఛాన్స్..?

PM Modi will make nomination in Varanasi today

మూడోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కాసేపట్లో మోడీ తో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి కేంద్ర మంత్రులకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయ డంఖా మోగించింది. తెలంగాణ 8 లోక్ సభ స్థానాలు , ఏపీ లో కూటమిగా ఏర్పడి 21 స్థానాలు గెలిచింది. దీంతో ఇరు రాష్ట్రాల నుండి పలువురికి కేంద్ర మంత్రుల ఛాన్స్ ఇచ్చింది బిజెపి.

ఏపీ నుండి ఇద్దరు టిడిపి ఎంపీలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అలాగే బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణ నుండి బండి సంజయ్ , కిషన్ రెడ్డి లకు ఛాన్స్ ఇచ్చారు. మరి వీరి ఏ శాఖలు ఇస్తారనేది తెలియాల్సి ఉంది.