మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ మరో వీడియో వైరల్‌

new-cctv-footage-from-satyendra-jain-room

న్యూఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను రిలీజ్ చేసిన తీహార్ జైల్ అధికారులు లేటెస్ట్ గా ఆయన ఆహారం తీసుకుంటున్న మరో వీడియోను రిలీజ్ చేశారు. జైల్లో సత్యేంద్రజైన్ 8 కిలోల బరువు పెరిగినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. అయితే జైల్లో సత్యేంద్ర జైన్ 28 కిలోల బరువు తగ్గినట్లు అతని లాయర్ చెప్పారు. సత్యేంద్రజైన్ లాయర్ వాదనలకు.. జైలు అధికారులు చెప్పిన దానికి పొంతన లేకపోవటంతో ఈ వీడియోపై మరోసారి వివాదం చెలరేగే అవకాశం ఉంది.

ఈ వీడియోపై మండిపడుతున్నారు బిజెపి నేతలు. సత్యేంద్రజైన్ కు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సత్యేంద్ర జైన్ కు బయటి నుంచి ఫుడ్ తీసుకొస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను బిజెపి నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు .

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/