రైతుకు దండం పెడుతూ వేడుకున్న పోలీస్ కానిస్టేబుల్‌

పోలీసుల్లో మంచివారు ఉంటారు…చెడ్డవారు ఉంటారు. అధికారం చేతిలో ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం మానవతా దృక్పధంతో ఆలోచిస్తుంటారు. మొన్నటికి మొన్న మఠంపల్లి ఎస్సై రవి కుమార్ అకాల వర్షం నుంచి పంట తడవకుండా కాపాడేందుకు రైతుకు అండగా నిలిచి వార్తల్లో నిలిచారు. ఎస్సై రవి కుమార్ తన సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమానికి బందోబస్తు విధులకు వెళ్లారు. కార్యక్రమం పూర్తై తిరిగొస్తుండగా.. అప్పుడే అకాల వర్షం మొదలైంది. రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు.. కల్లాల్లో తడుస్తున్న మిర్చి పంటను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అది గమనించిన ఎస్సై రవి వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపించి అక్కడికి పరుగెత్తారు. కవర్లను (పరదాలు) కప్పడంలో రైతులకు సహాయపడ్డారు.

గాలి వానను సైతం లెక్కచేయకుండా ఎస్సై రవి, ఇతర పోలీసు సిబ్బంది.. మిర్చి పంటపై కవర్లను కప్పారు. గాలికి కొట్టుకుపోకుండా పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకొచ్చి వాటిపై ఉంచారు. పోలీసులు చేసిన ఈ పనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో …నెటిజన్లు రవి ఫై పొగడ్తలు కురిపించారు.

తాజాగా మనస్తాపానికి గురైన రైతు..కరెంట్ స్థంభం ఎక్కి ఇంతకు దిగకపోవడం తో ఓ కానిస్టేబుల్‌ ‘‘ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు’’ అని బ్రతిమాలాడడం తో కిందకు దిగొచ్చాడు. ఈ ఘాతాం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్‌ జిల్లా, ముస్తాబాద్‌ మండలంలోని సేవాలాల్‌ తండాకు చెందిన దరంసోత్‌ రవి, బాలరాజు అన్నదమ్మల పిల్లలు. ఓ భూమి రిజిస్ట్రేషన్‌ విషయమై రవి, బాలరాజుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రవి తన పొలంలో వేసిన వరి పంటను కోసేందుకు వెళ్లగా.. బాలరాజు అడ్డుకున్నాడు. సమస్య తీరేంత వరకు వరి పంట కోయటానికి వీల్లేదని అన్నాడు. దీంతో మరోసారి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.

భూమి తనకు రావటం లేదని బాలరాజు మనస్తాపానికి గురయ్యాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న కరెంట్‌ స్తంభం ఎక్కాడు. స్థానికులు ఎంత చెప్పినా అతడు కిందకు దిగలేదు. కరెంట్‌ ఆఫీస్‌కు ఫోన్‌ చేసి కరెంట్‌ను ఆఫ్‌ చేయించారు. ఆ వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి అతడ్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినలేదు. దీంతో ఓ కానిస్టేబుల్‌ ‘‘ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు’’ అని అనటంతో బాలరాజు కిందకు వచ్చాడు.