బాలు ఆర్యోగంపై హరీష్‌ రావు స్పందన

బాలసుబ్ర‌హ్మ‌ణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి

Harish Rao
Harish Rao

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యంపై  స్పందించారు. ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేట‌ర్స్‌పై ఉంచి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, విదేశీ వైద్యుల సూచనల మేరకు ఎక్మో పరికరంతో బాలుకి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ట్వీట్ చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, ఇత‌ర భాష‌ల‌లో కొన్ని ద‌శాబ్ధాలుగా సంగీత ప్రియుల‌ని ప‌ర‌వ‌శింప‌జేస్తున్న లెజండ‌రీ సింగర్ బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాను అని హ‌రీష్ రావు పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/