తల్లి కాదు.. కసాయి!

వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని మూడేళ్ళ చిన్నారిని హత్య చేసిన వివాహిత

The mother killed the child

Visakhapatnam District: కన్నతల్లి తన మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన మధురవాడ మారికవలసలో జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని మూడు ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసింది. . మారికవలస గ్రామంలో వరలక్ష్మీ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీష్‌రెడ్డి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

Clashes between police, woman, people

తన వివాహేతర బంధం కారణంగా తన మూడేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. దీంతో వరలక్ష్మీపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాటతో పాటు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/