‘కంటి చుక్కలపై ఇపుడే అనుమతి ఇవ్వలేం’

ఏపీ సర్కార్ స్పష్టీకరణ

High Court hearing on Anandaiah eye drops
High Court hearing on Anandaiah eye drops

Amaravati: ఆనందయ్య తయారు చేసిన కంటి చుక్కలపై పై ఇపుడే అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం వెల్లడించింది. ఆనందయ్య కంటిచుక్కల మందుపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఐ డ్రాప్స్ కి చేసిన పరీక్షల్లో స్టేరిలిటీ టెస్టులో ఇబ్బంది ఉందని పేర్కొంది. కంటికి సంబంధించిన విషయం కాబట్టి డీటైల్డ్ రిపోర్టు రావటానికి 3 నెలలు పడుతుందని తెలిపింది. నివేదిక రాకుండా ఐ డ్రాప్స్ వేయటానికి రికమెండ్ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/