పేదలకు సొంత ఇల్లు ప్రభుత్వ లక్ష్యం

వైయ‌స్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

Tadepalli: పేదల సొంత ఇంటి క‌ల నిజం చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేద‌వాడు ఎక్క‌డా ఉండ‌కూద‌ని ఆయన పేర్కొన్నారు. . గురువారం తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ల‌బ్ధిదారులు, అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విధానంలో మాట్లాడారు.

175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నామని., . వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. . రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. పీఎంఏవై తో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నామని, 17 వేల వైయ‌స్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. స్థలాన్ని బట్టి విలువ ఉంటుందాని, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆస్తి విలువ వస్తుందని ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/