బలగం ఖాతాలో మరో అవార్డు

వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బలగం చిత్ర ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి హీరోగా దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి అఖండ విజయం సాధించింది.

తెలంగాణ నేపథ్య కథ గా ఈ చిత్రం తెరకెక్కింది. కేవలం ఈ సినిమా ప్రశంసలకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేట్రికల్‌గా మంచి కలెక్షన్లను నమోదు చేస్తూ వస్తుంది. రీసెంట్ గా అమెరికాలోని లాస్ ఏజెంలెస్ సినిమాటోగ్రఫి అవార్డు (LACA)లో బలగం సినిమా సినిమాటోగ్రపి విభాగం సత్తా చాటుకొన్నది. ఈ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆచార్య వేణును అవార్డు వరించింది. ఇంకా ఉత్తమ చిత్రంగా కూడా బలగం అవార్డును అందుకొన్నది. ఈ అవార్డును దర్శకుడు వేణుకు అందజేశారు.

ఇదిలా ఉండగానే తాజాగా అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ – ఆమ్‌స్టర్‌డామ్‌ కార్యక్రమంలో మరో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని అందుకున్నారు. యూకే, యూఎస్‌, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన చిత్రాలు, దర్శకులను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడంపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వచ్చిన అవార్డుతో ‘బలగం’ ఖాతాలో ఏకంగా తొమ్మిది అవార్డులు చేరాయని దర్శకుడు వేణు పేర్కొన్నారు.