జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం : ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు -దొంగల మరి సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో కండక్టర్ మృతి చెందగా, బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెలిమినేడు వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, ప్రమాదంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్‌ సహాయంతో పోలీసులు వాహనాలను తొలగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి రోడ్డులో మళ్లిస్తున్నారు.