‘ఆదిపురుష్’ నుండి ‘శివోహం’ సాంగ్ విడుదల

‘ఆదిపురుష్’ నుండి ‘శివోహం’ అనే సాంగ్ విడుదలైంది. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

తాజాగా సినిమాలోని ‘శివోహం’ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసారు. ‘మహా ఫాల నేత్ర .. ‘ అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. హరిచరణ్ ఆలపించాడు. అజయ్ – అతుల్ స్వరపరిచిన ఈ పాట త్వరగా కనెక్ట్ అవుతుంది.

YouTube video