ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు?: గవర్నర్ తమిళిసై

ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్

governor-tamilisai-soundararajan

హైదరాబాద్‌ః తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బిల్లు చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలనుకుంది. అందుకోసం గవర్నర్ వద్దకు బిల్లును పంపింది. కానీ గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బిల్లు పరిశీలన గురించి సీఎస్ శాంతి కుమారికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు.

ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారని గవర్నర్ ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్‌ ఇస్తారా? పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు ఏంటని.. గవర్నర్ తమిళిసై సీఎస్​కు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.