నామామి గంగే విషన్‌ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi inaugurates projects related to Namami Gange in Uttarakhand

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఉత్త‌రాఖండ్‌లో నామామి గంగే మిష‌న్ కింద ప‌లు ప్రాజెక్టుల‌ను ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించి సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు.
తాము తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌తో కార్మికులు, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు బ‌లోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. కానీ కొంద‌రు త‌మ స్వార్థం కోసం ఎలా ఆ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నారో దేశ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. నూత‌నంగా ఏర్ప‌డిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వ‌ద్ద ట్రాక్ట‌ర్‌ను ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న‌ను ప్ర‌ధాని త‌ప్పుప‌ట్టారు. ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, ప‌రిక‌రాల‌కు ఇప్పుడు నిప్పుపెట్టి రైతుల‌ను అవ‌మానిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఓపెన్ మార్కెట్‌లో రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునేందుకు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/