వారి సేవలను ప్రభుత్వం మర్చిపోదు

తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

allola indrakaran reddy
allola indrakaran reddy

నిర్మల్; కరోనా మహమ్మారి విజృభిస్తున్న ఈ విపత్కర సమయంలో, నిరంతరం సేవలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం మరచిపోదని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ సిబ్బంది తో కలిసి ఆయన భోజనం చేసారు. అనంతరం కార్మికులను సన్మానించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి . ఇందుకు నిరంతరాయంగా పని చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే కారణమని ఆయన అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం మర్చిపోదని మంత్రి అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/andhra-pradesh/