తెలంగాణ ఎడ్‌సెట్‌ దరఖాస్తులు నేటి నుంచే

TS EDCET 2020 Exam
TS EDCET 2020 Exam

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడ్‌సెట్‌ 2020 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభమవుతోంది. తెలంగాణ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 20 చివరి తేదీ. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 25 చివరి తేదీ. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 30 చివరి తేదీ. రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు 2020 మే 4 చివరి తేదీ. అభ్యర్థులు 2020 మే 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 మే 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుంది. టీఎస్ ఎడ్‌సెట్ 2020 ప్రిలిమినరీ కీ 2020 మే 27న విడుదలవుతుంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించేందుకు 2020 మే 30 చివరి తేదీ. 2020 జూన్ 11న ర్యాంకులను వెల్లడిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://edcet.tsche.ac.in/  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/