సాయి తేజ్ ‘విరూపాక్ష’ నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం విరూపాక్ష . ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ ఆసక్తి రేపగా..ఇప్పుడు ‘నచ్చావులే నచ్చావులే’ అంటూ సాగే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రేపు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు. పంట పొలాల నేపథ్యంలో హీరో .. హీరోయిన్ రాళ్ల తెట్టెపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఏప్రిల్ 21 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.