ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఫై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలకు 7 స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసిన వైస్సార్సీపీ..టీడీపీ షాక్ ఇచ్చింది. ఓ స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. టీడీపీ నుండి బరిలో నిల్చున్న పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం డంఖా మోగించారు. వాస్తవానికి తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. అనురాధకు నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరగడంతో వైస్సార్సీపీ నాయకత్వం షాక్ లో పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ .. ఇలాంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని టీడీపీ తొలి నుంచి ఆయన ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారని… ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన తన నేర్పరితనాన్ని చూపారని అనుకుంటున్నామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుస్తామనే భావించామని… అయితే చంద్రబాబు ప్రలోభాలకు కొందరు గురయ్యారని, ఇక వారి రాజకీయ భవిష్యత్తును వారే చూసుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ వాడుకుని వదిలేసే మనస్తత్వమని , ఈ విజయాన్ని బలం అనుకుంటున్నారని, అది చంద్రబాబు పిచ్చితనమని అన్నారు. క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరనే విషయంలోకి ఇంకా వెళ్లలేదని… పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చూసుకుంటారని అన్నారు.