పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిని రెండేళ్ల పెంపుకు సిఎం జగన్ ఆదేశాలు

ఇటీవల ఏపీలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

CM Jagan orders to increase the age limit of police job applicants by two years

అమరావతిః ఏపీలో ఇటీవల ఏపీఎస్పీ, సివిల్ పోలీస్ విభాగంలో 6,511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్ల మధ్య వయసు వారు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అయితే సుదీర్ఘకాలం తర్వాత పోలీసు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందున వయోపరిమితి సడలిస్తే అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కలుగుతుందన్న విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/