దూరము

సాయినాథుని లీలలు

Shirdi-Sai-Baba
Shirdi-Sai-Baba

సాయిబాబా అంటే షిరిడీ జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే అక్కే మహాసమిధి అయ్యేవరకు నివసించాడు. రమణమహర్షి అంటే అరుణాచలం అంటే తిరువణ్ణామలై గుర్తుకు రావటం సహజమే.

ఎందుకంటే ఆయన ఆ ఊరు చేరినది మొదలు, ఆ ఊరు దాటి పోలేదు కనుక. ఒకసారి సాయిబాబా బాలక్‌రాంమన్కడ్‌ అనే భక్తుని మచ్ఛీంద్రగఢ్‌ పోయి, తపస్సు చేసుకోమన్నారు.

బాలక్‌రాంమన్కడ్‌కు సాయిసన్నిధిని విడిపోవడం ఇష్టం లేదు. ఆ మాట చెబుదామని ప్రయత్నించాడు.

కానీ చెప్పలేడు, చెప్పలేకపోయాడు ఎందుకంటే తాను అలా పలికితే గురువు ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుందని ఇక బదులు చెప్పలేక మచ్ఛీంద్ర గడ్‌ చేరాడు.

తపస్సును చేయనారంభించాడు. కొంతకాలం గడిచింది. ఎంతయినా సాయిసన్నిధి లేకపోవటము దుర్భరమే కదా! ఒకనాడు తపస్సు చేసుకుంటుంటే సాయి అతని ముందు సాక్షాత్కరించాడు.

అతడు తన కన్నులను తానే నమ్మలేకపోయాడు.

అప్పుడు సాయిబాబా ‘షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ నస్సునకు నిలకడ కలగచేయవలయునని ఇచటకు పంపితిని.

నేనెల్లప్పుడు షిరిడీలోనే ఉండెదనుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన దానిని షిరిడీలో చూచిన దానితో సమానముగా ఉన్నదో లేదో గ్రహింపుము.

ఈ కారణము చేత నిన్ను ఇచ్చటకు పంపితిని అన్నారు మన్కడ్‌తో సాయి అనబడు గురువు కేవలము షిరిడీకే పరిమితుడు కాడని, సర్వవ్యాప్తి అని అతడు గ్రహించాడు.

అతడు గ్రహించిన చాలదు, భక్తుందరకూ గ్రహించవలసిన విషయమే ఇది. ఇది సాయి వంటి గురువు లకే పరిమితము కాదు. గురువ్యవస్థక ఇది వర్తించదు. గురుహర్ రాయ్ సిక్కుల గురువు. సిక్కుల ఏడవ గురువు .

ఇతనిని గురువుగా సేవించిన వారితో భాయ్ గోండా ఒకరు. భాయ్ గోండా ను గురుహర్ రాయ్ జీ కాబుల్‌ వెళ్లి, అక్కడి ప్రజలకు బోధ చేయ మన్నాడు.

అది ఎంతో దూరంగా ఉన్న ప్రాంతము. గురువు ఆజ్ఞ ప్రకారము గురు సన్నిధిని విడిచి, తన భాష కాని ఊరికి పోయాడు. అక్కడున్న ప్రజలకు సద్గురు నానక్‌ గురించి, నామమహిమను గురించి తెలుపటం ప్రారంభించాడు.

వీలయినప్పుడల్లా ఉదయము, సాయంత్రము అను తేడా లేకుండా తన గురువును గురుహర్ రాయ్ ని ధ్యానించేవాడు. ఒకనాడు ఉదయమే అతడు ధ్యానంలోకి చేరుకున్నాడు. జపిజ్‌జీని పఠించసాగాడు. గురుపాదాలు మనసులో కదలాడాయి.

ఆ పాద పద్మములను తన రెండు చేతులతో స్పర్శించాడు. పాదములను పెనవేసుకున్నాడు. ఆనాడు గురుహర్ రాయ్ తన గురుగద్దెపై కూర్చున్నాడు. భక్తులతో ముచ్చటించాడు.

సందేహంతో వచ్చినవారికి సమాధానాలు చెప్పాడు గురువు. ఇంతలో భోజనాలు తయారయ్యాయి. అందరూ భోజనానికి రండి అని హెచ్చరిక ఇచ్చే గంట మోగింది.

ఆ గంటను గురుహర్‌ విన్నాడు. అక్కడున్న వారందరూ విన్నారు. ఎవ్వరూ లేవలేదు. ఎందుకంటే గురువ్ఞ ముందు గద్దె నుండి లేస్తే కదా, మిగిలిన వారు లేచేది. మరోసారి గంట మోగింది. గురువు గద్దె దిగలేదు. సాయంకాలమయింది.

అప్పుడు గురువు గద్దె నుండి దిగి, అందరితో పాటు భోజనశాలవైపు నడిచాడు. ఇప్పటి వరకు కాబూల్‌లో ఉన్న భా§్‌ుగోండా తన ధ్యానంలో నా పాదాలు పట్టుకుని కూర్చున్నాడు.

అతని పట్టును వదిలించుకుని భోజనానికి లేవటం సబబు కాదు కదా! ఇప్పుడే అతడు ధ్యానంలో నా పాదాలను వదిలాడు నేను లేచాను. ఇది భాయ్ గోండా పరిస్థితి అన్నాడు గురుహర్ రాయ్.

గురువు భౌతికంగా మన వద్ద, మన కన్నుల ముందు ఉండనక్కరలేదు. గురువు సర్వవ్యాప్తి.

  • యంపి.సాయినాథ్‌

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/