శ్రీవాసవీ కన్యకాదేవి

vaartha devotional stories
OM

విష్ణువర్ధన మహారాజు యొక్క సేనాన్ని విక్రమకేసరి. విష్ణువర్ధన మహారాజు వైశ్యామాత్యులను తన వద్దకు పిలిపించి వాసవిని వివాహమాడటానికి తాను కృతనిశ్చయుడై ఉన్నట్లు తెలిపాడు. వారు ఆ విషయములో ఒక సభను ఏర్పాటు చేసి, చర్చించి, నిర్ణయాన్ని తెలుపవలసి ఉన్నదని తెలిపారు. అందుకు విష్ణువరధనుడు ఒప్పుకొని తన సేనాని, మంత్రి అయిన విక్రమ కేసరితో ‘మేము రాజధానికి వెళుతున్నాము. నీవ్ఞ తగిన సైన్యముతో ఇక్కడే ఉండి వైశ్యుల కార్యకరలాపాలను గమనిస్తూ ఉండు.వారు ఏదైనా ద్రోహచింత చేస్తే వాసవిని బంధించి తీసుకుని రా.జాగర్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు. సభ జరిగింది. వాసవి, వాసవితో పాటు మరికొందరు ఆత్మాహుతి చేసుకోవటానికి నిశ్చయమైంది. నూతన వస్త్రాలను ధరించి ఆశ్రితులకు,దీనులకు దానాలిచ్చి అందరు వింధ్యవాసినీ దేవాలయానికి చేరారు. వాసవికి అభ్యంగన స్నానం చేయించి కంకణ కంఠహారాలతో అలంకరించారు. వాసవి వింధ్యవాసినీ దేవి సన్నిధిలో పద్మాసనం వేసుకుని ధ్యానంలో నిమగ్నమయింది. అంతలోనే చీకటి పడింది. విషయాన్నంతా గూఢచారుల ద్వారా తెలుసుకున్న విక్రమకేసరి వాసవిని బంధించి రాజు వద్దకు తీసుకెళ్లాలని దేవాలయంలోకి దొంగవలె ప్రవేశించాడు. ధ్యానంలో ఉన్న వాసవిని చూశాడు. ఆమెను బంధించాలని ఆమె వైపు ముందడుగు వేశాడు. ఒక్కసారిగా కోటి మెరుపు తీవెల ప్రకాశం ఆమె నుండి వెలువడింది. ఆ కాంతిని చూసిన విక్రమకేసరికి చూపుపోయి గ్రుడ్డివాడయ్యాడు. వెంటనే వాసవి పాదాల వద్ద పడి ఏడ్చాడు. తప అజ్ఞానాన్ని క్షమించి కరుణించి చూపు ప్రసాదించమని వాసవిని వేడుకున్నాడు. వాసవి అతనితో ‘నాయనా! విక్రమకేసరి! పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదు. నీకు దృష్టిని ప్రసాదించుచున్నాను. నిరంతరము దేవీధ్యాయమగ్నుడవై కీర్తమంతుడవ్ఞ కాగలవ్ఞ అని ఆశీర్వదించింది. వెంటనే విక్రమకేసిరికి చూపు వచ్చింది. అంధత్వము తొలగిపోయింది. అజ్ఞానము తొలగిపోయింది. విష్ణువర్ధన మహారాజు ఇక ఆగలేక చతురంగ బలలాలతో పెనుగొండకు బయలుదేరాడు. ముందు విజయసింహుడిని పంపాడు. విక్రమకేసరి నగరానికి వెలుపలనే విజయసింహుడిని కలిసి తన అనుభవాన్నంతా వివరించి, వాసవీదేవి మహత్యాన్ని గురించి చెప్పి విష్ణువర్ధన మహారాజు కొరకు వాసవిని బంధించాలన్న దుష్ట ఆలోచననను విరమించి వెనుతిరిగి పొమ్మని సలహా ఇచ్చాడు. ఆ మాటలను వినిన విజయసింహుని సైనికులంతా వాసవీదేవి భక్తులుగా మారారు గానీ విజయసింహుడు మాత్రం విక్రమకేసరి పై అకస్మాత్తుగా దూకి చంపేశాడు. దానిని చూసిన సైనికులు కోపంతో విజయసింహుని చుట్టుముట్టి ఖండఖండములుగా నరికివేశారు. అహింసను ఆయుధంగా చేసుకొన్న వాసవీదేవి ఉద్యమంలోనూ, గాంధీ మహాత్ముని ఉద్యమంలోనూ అక్కడక్కడ చెదురుమదురుగా ఇలాంటి హింసాయుత ఘటనలు జరిగినా మొత్తం మీద అవి అహింసనే లక్ష్యంగా జరుపబడిన ఉద్యమాలని పెద్దలు చెబుతారు. విక్రమకేసరికి ప్రాణం పోయింది గానీ వాసవీదేవి ఆశీర్వాద బలం వల్ల కీర్తి దక్కింది. వాసవీ మాత కృపకు ఆయన పాత్రుడయ్యాడు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/