వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జగన్‌ ఘన నివాళి

ఇడుపులపాయ: సీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రులు అంజాద్‌ భాషా, ఆదిమూలపు సురేష్‌, అప్పలరాజు ఉన్నారు.

కాగా, సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పులివెందులలోని జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/