శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్చ జరగాలి

సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారని ప్రశ్నించిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

buggana rajendranath
buggana rajendranath

అమరావతి: అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లును ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభ మండలిలలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టిడిపి నోటీసు ఇచ్చింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి బిల్లులను ప్రవేశపెట్టకుండా ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్‌ 71 ప్రకారం ముందు ప్రభుత్వ పాలసీపై ఇచ్చిన మోషన్‌పై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో యనమల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి బుగ్గన రాజేద్రనాథ్‌ రెడ్డి శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ముందు చర్చ జరగలన్నారు. శాసనసభ చేసిన చట్టానికి మండలిలో ప్రాధాన్యం ఇస్తారా..? లేక పాలసీపై మోషన్‌కు ప్రాధాన్యం ఇస్తారా..? అని బుగ్గన ప్రశ్నించారు. సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారని అన్నారు. ముందు వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలని బుగ్గన పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/