కరోనాతో సౌదీలో 11మంది భారతీయులు మృతి

సౌదీలో ఇప్పటి వరకు 13,930 మందికి కరోనా

corona virus
corona virus

సౌదీ: సౌదీలో బతుకుతెరువు కోసం వెళ్లిన 11 మంది భారతీయుల కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈవిషయం సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని వెల్లడించారు. సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మరోవైపు సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 121 మంది మృతి చెందారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/