ఈరోజు నుంచి యుద్ధమే – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం దాల్చాడు. ఎన్ని రోజులుగా కూల్ కూల్ గా కనిపించిన పవన్..ఈరోజు వైస్సార్సీపీ నేతలపై తనలోని మరో యాంగిల్ ను చూపించారు. ‘నా కొడకల్లారా.. మీకు మాములుగా ఉండదు.. సన్నాసుల్లారా.. వెధవల్లారా..ఏంట్రా మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు ఎందుకురా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా? నేను విడాకులు ఇచ్చి చట్టపరంగా చేసుకున్నాను. వెధవల్లారా కావాలంటే మీరు చేసుకోండి’ అంటూ వైస్సార్సీపీ నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రీసెంట్ గా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన పరిణామాలు, జనసేన కార్య కర్తల అరెస్ట్ లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో మంగళగిరిలో భేటీ అయ్యారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను గొడవల్లోకి లాగితే నాలుక చీరేస్తా. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా. నాపై బూతుల పంచాంగం విప్పే ప్రతి వాడిని నించోబెట్టి తోలు తీస్తా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా చెప్పేది. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నార్రా. రండ్రా.. ఎంతమంది వైస్సార్సీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులొస్తారో రండి.

నేను వాహనం కొంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చారని అంటారా. దానికి జీఎస్టీ కూడా కట్టా. ఎదవల్లారా నా సంపాదన ఎంతో మీకు తెలుసా? యుద్ధం ఎప్పుడో చెప్పండి రా.. రాడ్ల.. హాకీ స్టిక్కులా.. ఉట్టి చేతులా? ఛాలెంజ్ విసురుతున్న నా కొడకల్లారా. తోలు తీస్తా నా కొడకల్లారా ఒక్కొక్కడికి. ఈరోజు నుంచి యుద్ధమే” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశానని… రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా.. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

కులాల పేరుతో కొందరు వైస్సార్సీపీ నాయకులు ఏపీలో చిచ్చులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సభ్యత, సంస్కారం ఉన్న వాళ్లం కాబట్టి ఇన్నాళ్లూ తాము మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ ఇవాళ్టి నుంచి వైస్సార్సీపీ ఫై యుద్ధానికి సై అని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన సహనాన్ని చూశారని.. ఇక నుంచి యుద్ధమేనని అన్నారు. వైస్సార్సీపీ నీచుల సమూహం ఎక్కువగా ఉందని.. ప్రజల గురించి పట్టించుకునే నాయకుడే లేరని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.