అమెరికాలో 24 గంటలో 3,176 కరోనా మృతులు

ప్రస్తుతం 50,363కు చేరిన కరోనా మరణాలు

america-Coronavirus
america-Coronavirus

వాషింగ్టన్‌: అమెరికాకు కరోనా వైరస్‌ నుండి కొంత మేర ఉపశమనం లభించిదని అనుకుంటున్న సమయంలో గురువారం మరోసారి మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటలో 3,176 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ 50,363కు చేరింది. కాగా ఇప్పటి వరకు 8,89,999 మందికి ఈవైరస్‌ సోకినట్లు నిర్థారించారు. వీరిలో 82,112 మంది కోలుకున్నారు. అయితే మరోవైపు, వైరస్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రాలు నిషేధాజ్ఞలను సడలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరోపక్క, ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా రూపంలో అమెరికాపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. చైనా సహా ఎవరికీ లేనంతటి గొప్ప ఆర్థిక వ్యవస్థ అమెరికా సొంతమని, మూడేళ్లుగా దీనిని నిర్మించుకున్నామని అన్నారు. వైరస్ రూపంలో అకస్మాత్తుగా తగిలిన దెబ్బ నుంచి కోలుకునేందుకు కొంత డబ్బు ఖర్చు చేయక తప్పడం లేదన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/