అనంతపురం ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Fire Accident -Govt Hospital

అనంతపురం: అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రిలో గతరాత్రి 12 గంటల సమయంలో కొవిడ్‌ వార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ గది పక్కనే 24 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే, సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను మరో వార్డుకు తరలించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/