కూతురి ఆత్మహత్య.. తండ్రిని దండించిన పోలీసు

High Tension at Patancheru Area Hospital
High Tension at Patancheru Area Hospital

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరులో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ఉదయం ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని సంధ్య మృతదేహాన్ని విద్యార్థి సంఘ నాయకులు తరలించే యత్నం చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోస్టుమార్టం గది తలుపులను, ఆస్పత్రి అద్దాలను విద్యార్థి సంఘ నాయకులు ధ్వంసం చేశారు. వారిని వెంటనే అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ అమ్మాయి తండ్రిని ఓ పోలీస్ అధికారి బూట్ కాళ్లతో తన్నాడు. దీంతో ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. సంధ్యారాణిది మహబూబ్ నగర్ జిల్లా .. జడ్చర్ల మండలం.. మల్లెబోయినపల్లి. కూతురు మరణంతో తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు.. యాజమన్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/