బిజెపికి అభ్యర్థులే దొరకడం లేదు!

టిఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బిజెపి ఉంది

V. Srinivas Goud
V. Srinivas Goud

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపికి అభ్యర్థులే దొరకడం లేదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్లు దక్కని టిఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బిజెపి ఉందంటూ శ్రీనివాస్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి సెంటిమెంట్‌తో ఓట్లు సంపాదించుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బిజెపికి అభ్యర్థులు దొరకడం కష్టం మన్నారు. తెలంగాణలో మరో ఇరవై ఎళ్లు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ నుంచి ఒక్క హామీ అయినా ఇప్పించే సత్తా తెలంగాణ బిజెపి నేతలకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రజలలో కుల, మతాలకు చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని బిజెపి చూస్తుందని అటువంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందిని శ్రీనివాస్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/