భారత్‌-ఆసీస్ పోరు ఎప్పటికీ రసవత్తరమే

ఇది ఓ సంప్రదాయం: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా

Steve Waugh
Steve Waugh

సిడ్నీ: ప్రస్తుతం భారత్‌ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 14న ముంబైలోని వాఖండే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఇక ఇరుజట్ల మధ్య 2020 చివరలో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో కోహ్లీసేన పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ఎంతో సమయం ఉన్నప్పటికీ అప్పుడే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ క్రీడాకారులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టీవ్‌ వా మాట్లాడుతూ… ‘భారత్‌ఆస్ట్రేలియా తలపడే ఏ సిరీస్‌ అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సిరీస్ ఏదైనా గొప్పదే. ఇదో సంప్రదాయంగా మారింది. అప్పుడే 2020 చివర్లో పర్యటనపై ఆసక్తి పెరిగిపోతోంది. స్మిత్‌, వార్నర్‌తో ఆసీస్ జట్టు మరింత బలపడింది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందుకే ఈ సిరీస్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టు ఆడటం సవాలే. విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాడు దానిని స్వాగతిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఏదైనా పరిస్థితులు, ప్రదేశంతో సంబంధం లేకుండా గెలవాలనే కోరుకుంటుంది. భారత్‌ అందుకు మినహాయింపేమీ కాదు’ స్టీవ్‌ వా అన్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/