‘జ్ఞానాగ్ని దగ్ధకర్మాణా’

ఆధ్యాత్మిక చింతన

The Bhagavad Gita
The Bhagavad Gita

నేటి మన స్థితిని (దుస్థితిని) తెలిపే ఒక చక్కని ఉదాహరణ మనకు ‘సంతుమత సమాలోచనం అనుగ్రంధంలో లభిస్తుంది.

ఒక బంగారపు ముక్కను చిన్న చెక్క పెట్టెలో పెట్టి దాని మీద అనేక రకాల గుడ్డలు చుట్టి, వాటి మీద మైనపు లేపనం చేస్తే, అపుడు బంగారపు ముక్క కనిపించదు.

దానిని నిప్పులో వేస్తే మొదట మైనం కరిగిపోతుంది. తరువాత గుడ్డ పరదాలు కాలిపోతాయి. చివరకు చెక్క పెట్టె కాలిపోతుంది.

వాటి అడుగున ఉన్న శుద్ధమైన బంగారపు ముక్కలు బయట పడుతుంది.

మనం సురత్‌ శబ్ధాభ్యాసం చేసినకొద్దీ మనసూ, ఆత్మలమీద పడియున్న అన్ని రకాల కర్మల మాలిన్యమూ కాలిపోయి, మనసూ, ఆత్మలు నిర్మలమవసాగుతాయి. (ఫుట-511-సంతుమత సమాలోచనము, రాధాస్వామి సత్సంగ్‌బ్యాస్‌)

మనము ‘అమృతస్య పుత్రాః అమృత పుత్రలము అంటే శుధ్ద బంగారపు ముక్కలు. మన చుట్టూ జన్మజన్మల సంస్కారాలు, సత్కర్మ దుష్కర్మలఫలతాలు ఎన్నెన్నో చుట్టుకున్నాయి.

పైన పేర్కొన్న ఉదాహరణలోకి గుడ్డపేలికల్లాగా, మైనపు లేపనం లాగా, చెక్క పెట్టెలాగా, వాటినే స్మూశరీరం, స్థూలశరీరం, కారణశరీరం లాంటి పేర్లతో పేర్కొంటారు.

పెద్దలు-అందుకేమన స్వస్వరూపం బయటపడదు. తెలియబడదు. అవన్నీ రూపుమాసిపోవాలంటే, మన నిజరూపం బయటపడాలంటే ఆ రకరకాల శరీరాలను భస్మంచేసే అగ్ని కావాల్సిందే దాన్నే జ్ఞానాగ్ని అని పేర్కొంటారు శ్రీ కృష్ణపరమ్మాతం .

అయితే ఆ అగ్నిని ఎవరో ఇతరులు రగల్చలేరు, బయటి నుంచి నిప్పు పెట్టలేరు. పైన పేర్కొన్న ఉదాహణలో బయటివ్యక్తి ఎవరో బయటినుంచి నిప్పుపెడితే అప్పుడు మొదట మైనం కరుగుతుంది.

ఆ తరువాత గుడ్డ పరదాలు కాలిపోతాయి.

చివరకు చెక్కపెట్టె కాలిపోతుంది. బంగారపు ముక్క బయటపడుతుంది. కానీ మన విషయంలో ఈ క్రమం వ్యతిరేకదిశలో ప్రారంభమవు తుందని పెద్దలు చెబుతారు. జ్ఞానాగ్నిరి ఎవరో ఇతరులు

బయటినుంచి రగల్చరు. అందుకే శ్రీ కృష్ణపరామాత్మడు ‘ఉద్ధరేదాత్మనాత్మనం అని భగవద్గీతలో చెప్పాడు. ఆయన కూడా అర్జునుడిలో జ్ఞానాగ్నిని రగల్చలేదని మహా భారతమేఋజువు చేస్తుంది.

ఇక్కడ ఈ విష యంలో బయటివారు,బయటినిప్పు పనికి రాదని తెలుస్తుంది. ఆ జ్ఞానాగ్ని ఎవరిలోపలవారే రగుల్చుకోవాలి.

అది లోపలే ఉద్భవించి, లోపలినుంచి బయటకు తన చుట్టూ ఆవరించి యున్న కారణం, సూక్ష్మ, స్థూల శరీరాలను కాల్చివేస్తుంది. చివరకు తాను తానుగా ప్రకాశిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే బంగారంలోనుంచే అగ్ని వెలుగుతుంది.

ముందు చెక్కపెట్టెను కాలుస్తుంది, మైనం కరిగిపోతుంది. గుడ్డలు కాలిభస్మమైపోతాయి. కానీ మన అనుభవమంతా తలకిందులుగా (ఊర్ధ్వ మూలమథఃశాఖ మశ్వత్థం (అశ్వత్థ వృక్షానికి వేరుపై, కొమ్మలు కింద) (భగవద్గీత-15 అధ్యాయం1వ శ్లోకం)- సత్యం ఒక రకంగా ఉంటే తలకిందులుగా గోచరించటం) ఉంటుంది.

అందువల్ల బయటివ్యక్తి (గురువు),బయటి నిప్పు (బోధ, ఉపదేశము) తప్పక అవసరమని భావిస్తాము. ఒకవేళ బయటి వ్యక్తి కొదరికి అవసర మైనా, జ్ఞానాగ్ని మాత్రం లోపల ప్రజ్వరిల్ల వలసిందే. ఆ జ్ఞానాగ్ని ఎవరికి లభిస్తుంది.

(శ్రద్ధావాన్‌ల భతేజ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్మడే చెప్పాడు (భగవద్గీత-4 అధ్యాయం 39వ శ్లోకం) ఆ జ్ఞానం లభిస్తే పరమాత్ముడే చెప్పాడు. (భగవద్గీత-4 అధ్యాయం 39వ శ్లోకం)

ఆ జ్ఞానం లభిస్తే పరమశాంతిని, శాశ్వత శాంతిని పొందుతాడని పరమాత్ముడే నిశ్చయించి, ప్రక టించాడు.

‘జ్ఞానాగ్ని స్సర్వక ర్మాణి భస్మ సాత్కురుత జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేస్తుందనీ అంటాడు పరమాత్మ (భగవద్గీత 4-37 శ్లోకం)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/