దానధర్మాలు రహస్యంగా చేయాలి

JESUS

మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన, దానం, ఉపవాసం ఈ మూడింటిని రహస్యంగా ఉంచుకోవాలనే యేసుప్రభువ్ఞ ఆజ్ఞను ఎంతమంది గ్రహించి, దాని ప్రకారం జీవిస్తున్నారు? ప్రభువ్ఞ తన మొట్టమొదటి ప్రసంగంలో ఈ మాటల్ని చెప్పాడు. దానం గురించి ఆయన మాట్లాడుతూ ‘నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ ఎడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:3,4). చాలామంది ఈ విషయాన్ని గుర్తించకుండా తమ దానధర్మాలు ఇతరులు గుర్తించాలని, లేదా తమ సేవాగుణాన్ని చాటిచెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

చేసేది కొంచెం చెప్పుకునేది ఎక్కువ. ఇలాంటి ధర్మాలు ఎన్ని చేసినా దేవ్ఞడి నుంచి ప్రతిఫలం లభించదు. అలాగే ప్రార్థనావిధానం. చాలామంది గొప్ప దైవసేవకుల ప్రార్థనాజీవితాన్ని గురించి ఇతరులతో పంచుకుంటూ వ్ఞంటారు. యేసుప్రభువ్ఞ కూడా ‘ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవ్ఞని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను (లూకా 6:12)లో వ్ఞంది. అంటే ప్రార్థనయొక్క ప్రాముఖ్యత, 12మంది శిష్యులను ఎంపిక చేసుకునేందుకు ఎంతో ప్రార్థన చేసి, తండ్రి చిత్తాన్ని తెలుసుకుని, ఆ శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. దీనిఅర్ధం ప్రభువ్ఞ ప్రార్థనాజీవితాన్ని మనకు తెలుపుతున్నది అంటే మనం అలాంటి ప్రార్థనాజీవితాన్ని కలిగి వ్ఞండాలని. మనం కొద్దిగా ప్రార్థన చేస్తే చాలు అందరికి నేను ప్రార్థిస్తున్నాను అని బూర ఊదుకునేలా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాం.
మన ప్రార్థన జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. వేకువజామున ఎన్ని గంటలకు లేచి ప్రార్థిస్తున్నా, రోజుకు ఎన్ని గంటలు ప్రార్థనలో గడుపుతున్నా ఎవరికివారు డబ్బాకొట్టుకునేలా చెప్పుకోకూడదు. మన ప్రార్థనాజీవితం మనకు దేవ్ఞడికి మధ్య సంబంధించిన రహస్యప్రక్రియ మాత్రమే అది. అలాగే ఉపవాసం చేస్తున్నప్పుడు ‘విూరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి.. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు, వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా విూతో చెప్పుచున్నాను.

ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీతండ్రికే కనబడవలెనని, నీవ్ఞ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:16,17,18). నేను ఉపవాసం ఉన్నాను అనే విషయాన్ని ఎవరికీ చెప్పుకోకూడదు. దాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. కాబట్టి దేవ్ఞడి ఆజ్ఞల్ని మనం పాటించాలి. మన స్వభావం ఇతరులు మన నీతిక్రియల్ని గుర్తించాలని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతంగా చూపించుకోవాలనే బలహీనమైన గుణాలు ప్రతివారిలోనూ వ్ఞంటాయి. అయితే దేవ్ఞడి వాక్యం మనల్ని వెలిగించేకొద్దీ మనం ఆ ఉన్నతమైనస్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం చేస్తున్నా, దానధర్మాలు చేస్తున్నా వాటికి తగిన ప్రతిఫలాన్ని పొందాలంటే రహస్యంగా ఉంచుకుందాం. లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. –

పి.వాణీపుష్ప

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/