జానకి వంతెనను జాతికి అంకితం చేసిన సిఎం

uttarakhand-cm-dedicated-janaki-seth-to-the-nation

డెహ్రాడూన్‌: సిఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ తెహ్రీ గర్హ్వాల్లోని మునికి రెటి ప్రాంతంలో గంగాన‌దిపై నిర్మించిన జాన‌కి వంతెన‌ను శుక్రవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. 346 మీటర్ల పొడవైన ఈ పాదచారుల వేలాడే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.48.85 కోట్లు వెచ్చించింది. మూడు వరుసలో ఈ వంతెనను నిర్మించారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో దశాబ్దాలుగా భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం తెలిపారు. త్వరలో పౌరిలోని సిన్‌తాలిబీన్‌ నదుల మధ్య ఓ వంతెన నిర్మాణాన్ని పార్రంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బజరంగ్‌ సేతుగా దీనికి నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని పూర్తిగా ప్రత్యేక గాజుతో కళాత్మకంగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/