అందమైన మనీపర్సులు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

Money Wallets
Money Wallets

పుస్తకం హస్తభూషణం అన్న మాట నిజమే గానీ మాకు మాత్రం చేతిలో పర్సూ భూషణమే అంటారు నేటి తరం అమ్మాయిలు.

కాలేజీలకు పక్క నున్న టీస్టాల్‌కు వెళ్లాలన్నా, ఓసారి ఫ్రెండ్‌ను కలవడానికి పక్కసందు దాకా కదలాలన్నా చేతిలో ఫోన్‌తో పాటు పర్సూ ఉంటుంది.

ఇక, కాలేజీలూ, ఆఫీసులకెళ్లేటప్పటి సంగతి చెప్పనే అక్కర్లేదు. అప్పుడు పెద్దసైజు బ్యాగు వేసుకుంటే కానీ సరిపోదు. సూపర్‌ మార్కెట్‌ను తలపించే ఆ బ్యాగులో ఇది అది అని లేకుండా బొట్టుబిళ్లలూ, కాటుకల దగ్గర నుంచి చాక్లెట్లూ, పెన్నుదాకా అన్నీ ఉంటాయి.

Money Wallets-
Money Wallets

అయితే, మనం బయటికి తీసుకువెళ్లేందుకు ఎంత సైజుది సరిపోతుంది అన్నదే అసలు విషయం. కాస్త చిన్నసైజు పర్సు తీసుకుంటే అవసరమైన వస్తువులు పట్టవు, లేదా పెద్దది ఎంచుకుంటే అన్నీ అందులోనే ఉండి కావలసిన వస్తువులు తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది.

ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ, మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడేలా మల్టీపర్సులూ, బ్యాగులూ బజార్లోకి వస్తున్నాయి.

ఈ రకం వాటిలో రెండూ, మూడు మొదలు నాలుగయిదు దాకా పర్సులు ఒకే హ్యాండిల్‌కు పెట్టుకునేలా రూపొందుతున్నాయి.

వీటిలో మనం తీసుకువెళ్లాల్సిన వస్తువులను విడివిడిగా సర్దుకోవచ్చు. ఉదాహరణకు ఒక పర్సులో, కార్డులూ తాళాలూ, యూఎస్‌బి కేబుళ్లూ, ఛార్జర్లూ పెడితే మరో దాంట్లో డబ్బులూ, ఇంకో దాంట్లో ఫోనూ ఐపాడ్‌లలాంటివీ, మరో దాంట్లో అలంకరణ సామగ్రి లేదా చాక్లెట్లూ బిస్కెట్లూ ఇలా పెట్టుకోవచ్చు.

ఏది మనకు అవసర మైతే ఆ పర్సును తెరచి తీసుకోవడమే. ఏదో అవసరం కోసం వాడుకునేవి అన్నట్టు కాకుండా, ఇప్పటి అమ్మాయిలు ఇష్టపడే ఫ్యాషన్‌ లుక్‌నీ దృష్టిలో పెట్టుకునే వీటిని తయారు చేస్తున్నారు.

Money Wallets
Money Wallets

చతురస్ర కారం, వృత్తం, త్రికోణాకారం, హృదయాకారం. ఇలా విభిన్న ఆకృతుల్లో రకరకాల రంగుల్లో ఇవి రూపొందు తున్నాయి.

వీటన్నింటి కలగలుపుగానూ మల్టీపర్సులు తయారవుతు న్నాయి. ఈ రకం క్లచ్‌లలో కావాలనుకున్న పర్సును ఉంచుకుని వద్దు అనుకున్నవి తీసేందుకు వీలూ ఉంది.

వీటిలో ఉండే పర్సుల సంఖ్యను బట్టి ట్రిపుల్‌ క్లచ్‌పౌచ్‌ మల్టీపౌచ్‌ బ్యాగ్‌..ఇలా పిలుస్తుంటారు.

అలాగే హ్యాండ్‌ బ్యాగుల్లోనూ మూడునాలుగు బ్యాగులు కలిపి ఒకే హ్యాండిల్‌కు ఉండేవి వస్తున్నాయి. అందులోనూ మనం అవసరాన్ని బట్టి వస్తువులు సర్దుకోవచ్చు.

ఇక, మనకు ఏం కావాలన్నా చటుక్కున తీసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/