హైదరాబాద్​ చేరుకున్న యశ్వంత్‌సిన్హా.. స్వాగతం పలికిన కేసీఆర్‌, కేటీఆర్‌

cm-kcr-welcomed-presidential-candidate-yashwant-sinha-who-reached-hyderabad

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, కేటీఆర్‌ తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు.

కాసేపట్లో వీరందరూ భారీ ర్యాలీగా ఎయిర్ పోర్టు నుంచి నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కు వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్, సిన్హా ప్రసంగించనున్నారు. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/