విజయవాడ నుంచి 27, 28, 29 తేదీల్లో హజ్ యాత్ర

ఏపీ వ్యాప్తంగా 692 మంది ముస్లిములు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు వర్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖదీర్ తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఈ నెల 27న ఉ.8.45కు 322 మంది బయలుదేరుతారన్నారు. 28న సా.4.55కు 322 మంది, 29న మ.2.50కు 48 మంది చొప్పున ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తారని పేర్కొన్నారు. ప్రయాణానికి 6 గంటల ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచించారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది పవిత్ర హజ్‌ యాత్రకు బయలుదేరే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్‌కమిటీ సభ్యులు పేర్కొన్నారు. స్థానిక ఈద్గా జామా మసీదులో ఏర్పాటుచేసిన హజ్‌ క్యాంపులో వక్ఫ్‌బోర్డ్‌ సీఈవో, హజ్‌ కమిటీ ఈవో అబ్దుల్‌ ఖదీర్‌ అధ్యక్షతన శుక్రవారం హజ్‌కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, దూదేకుల కార్పొరేషన్‌ ఎండీ గౌస్‌ పీర్‌, డైరెక్టర్‌ ఉర్దూ అకాడమీ, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ అలీమ్‌ బాషా తదితరులు హజ్‌ క్యాంపులో యాత్రీకులకు చేయవలసిన ఏర్పాట్లగురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.