టెస్లా కార్ల లైట్లతో నాటు నాటు సాంగ్ ..WOW అనకుండా ఉండలేరు

నాటు నాటు మోత ఇప్పట్లో తగ్గేలా లేదు. సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముందు , రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో ఊపేసిందో..తాజాగా ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడం తో మరోసారి వరల్డ్ వైడ్ గా మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది..ఈ సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పటివరకు ఈ సాంగ్ అదిరిపోయే స్టెప్స్ వేసిన వీడియోలను మాత్రమే చూసాం.

కానీ తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం చోటుచేసుకుంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆన్, ఆఫ్ చేస్తూ లయబద్ధంగా చేసిన ఆ లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.