‘శాకుంతలం’ నుంచి ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

‘శాకుంతలం’ నుంచి ప్రకాశ్ రాజ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు , టీజర్ , సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..సోమవారం సినిమాలోని ప్రకాష్ రాజ్ తాలూకా లుక్ ను రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో ఆయన పడవ నడిపే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. గర్భవతిగా ఉన్న శకుంతల, దుష్యంతుడి దగ్గరికి బయల్దేరుతుంది. ఆ క్రమంలో ఆమె పడవ ఎక్కుతుంది. ఈ పడవ ప్రయాణం కూడా కథలో కీలకమే అని, పడవపై చిత్రీకరించిన పాట కూడా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. .
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇక చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది.