అసెంబ్లీ దాడి ఘటనపై తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్‌ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లగా..అక్కడికి వచ్చిన వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి…సుధాకర్ బాబు టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడి చేసినట్లు టీడీపీ ఆరోపిస్తూ వారు తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసారు.

అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్సార్సీపీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుధాకర్ బాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎలీజాపై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ వీడియో ఫుటేజి పరిశీలించాలని పోలీసులను కోరారు.

సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఘటన ఫై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. డీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను సభలో అడుగు పెట్టనివ్వమని అన్నారు. జీవో 1 జారీ చేసిన ప్రభుత్వానికి సిగ్గు ఉందా?, అసెంబ్లీలో జరిగిన ఘటన ఆగ్రహం తెప్పిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. జీవో 1ను రద్దు చేయమని అడగడం తప్పా..? తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఓ చీకటి రోజు అని, అసెంబ్లీలో దాడి ఘటనలు గతంలో జరగలేదని, స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీనే దాడి చేసిందని అరోపిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనిషి బుచ్చయ్యచౌదరి మీదకు వస్తారా..? అని, స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయామనే బాధ తనకెప్పుడూ ఉంటుందని చంద్రబాబు అన్నారు.