10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోడీ కీలక ఆదేశాలు

అన్ని విభాగాల్లోని ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష
మిషన్ మోడ్ లో ఏడాదిన్నర కాలంలో భర్తీ చేయాలంటూ ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలపై సమీక్ష నిర్వహించిన మోడీ.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్​లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అన్ని శాఖలలోని మానవ వనరుల ప్రస్తుత స్థితిగతులపై మోడీ సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది. నిరుద్యోగంపై విపక్షాలు పదేపదే విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన రావడం గమనార్హం. ప్రభుత్వ శాఖలలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని పలువురు నేతలు ఇటీవల విమర్శలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/