చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం

నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్‌ను అరెస్టు చేయాల్సిందే అంటూ పాత‌బ‌స్తీలో నిర‌స‌న‌లు

హైదరాబాద్: హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా పాతబస్తీలో ముస్లీంలు నిరసన వ్యక్తం చేశారు. ప్రార్థనలు ముగిశాక ముస్లీంలు ర్యాలీగా బయల్దేరారు. నుపుర్ శర్మ, నిత్యానంద, రాజాసింగ్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాతబస్తీలో పోలీసులు భారీగా మొహరించారు.

చార్మినార్, మ‌క్కామ‌సీదు, కాల‌ప‌త్తార్, మెహిదీప‌ట్నం, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, షాహీన్‌న‌గ‌ర్, సైదాబాద్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో ముస్లింలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ముస్లింల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పాత‌బ‌స్తీలో పోలీసులు భారీగా మోహ‌రించారు. చార్మినార్ వ‌ద్ద పోలీసు ఉన్న‌తాధికారులు బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/