విజయసాయిరెడ్డి వస్తే ఎక్కడైనా ప్రమాణం చేస్తా : టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

విశాఖలో వేడెక్కిన ప్రమాణాల సవాళ్లు!

TDP MLA Velagapudi Ramakrishna
TDP MLA Velagapudi Ramakrishna

Visakhapatnam: ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే ప్రమాణం ఎక్కడ చేయమన్నా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్ విసిరారు.

టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతల మధ్య ప్రమాణ సవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్రమాస్తులపై ఎమ్మెల్యే వెలగపూడి ప్రమాణం చేయాలంటూ సాయిబాబా ఫోటోతో వైసీపీ కార్యకర్తలు వెలగపూడి నివాసానికి వెళ్లారు.

భూకబ్జాలపై విజయసాయిరెడ్డి ప్రమాణం చేయాలంటూ పోటీగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/