ఢిల్లీ ఎయిమ్స్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం

ఎవరూ గాయపడలేదన్న అధికారులు

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్టోర్ రూములో ఈ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మంటలను గంటలో అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రోగులందరినీ బాధిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. “ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో మంటలు, పొగ కనిపించింది. రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి తరలించారు. ఏడు ఫైర్‌ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/