చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ

టిడిపి, జనసేన జెండాలతో నిరసన ప్రదర్శన

telugu-people-conduct-rally-in-new-jersey

న్యూజెర్సీః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం పట్ల ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోనూ చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. న్యూజెర్సీలో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. మేమంతా చంద్రబాబునాయుడితోనే అనే బ్యానర్ ను, సేవ్ ఏపీ తదితర నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ టిడిపి, జనసేన జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు స్పందిస్తూ.. నాడు చంద్రబాబు తీసుకొచ్చిన విద్యాప్రమాణాల వల్లే తాము విదేశాల్లో మెరుగైన అవకాశాలు పొంది స్థిరపడ్డామని వివరించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.