‘చంద్రముఖిగా మారి ‘నిమ్మగడ్డ’లో ప్రవేశించిన చంద్రబాబు’

ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య

MP Vijay Sai Reddy
MP Vijay Sai Reddy

New Delhi: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనర్హుడని వైకాపా ఎంపీ విజయసాయి విమర్శించారు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా, కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో  ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిలిపివేశారని, ఆ సమయంలో కరోనా వ్యాప్తిని కారణంగా చెప్పారని, ఇప్పుడేమీ కరోనా పూర్తిగా తొలగిపోలేదని, మరి ‘నిమ్మగడ్డ’ ఎందుకంత ఎన్నికల నిర్వహణకు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. 

పార్టీ రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ‘నిమ్మగడ్డ’ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని అన్నారు. చంద్ర బాబు చంద్రముఖిగా మారి ‘నిమ్మగడ్డ’లో ప్రవేశించారని అన్నారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/