కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswara Rao joined the Congress

హైదరాబాద్‌ః ఖమ్మం జిల్లాలోని పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనతో చర్చలు జరిపి వేరే పదవి ఏదైనా ఇస్తారని ఆశించినా.. అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ తీరుపై మండిపాటుకు గురైన తుమ్మల తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించి తమ పార్టీలోకి ఆహ్వానించింది.

దీంతో ఈరోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీరి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్​కు పంపించారు. అనంతరం హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తన నిర్ణయం ఏదైనా.. ఎల్లప్పుడూ తన వెంటనే ఉన్న అనుచరులకు కూడా తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు.