ఇది కుప్పం చరిత్రలోనే చీకటి రోజు – చంద్రబాబు

ఇది కుప్పం చరిత్రలోనే చీకటి రోజు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటన లో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు కుప్పం లో అన్నా క్యాంటిన్‌ను ప్రారంభించాలని బాబు అనుకున్నారు. అయితే ప్రారంభించడానికి ముందే వైస్సార్సీపీ శ్రేణులు అన్నా క్యాంటిన్‌ను ధ్వసం చేసారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు క్యాంటిన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నడుచుకుంటూ అన్నా క్యాంటిన్ వైపు వెళ్లారు.

బస్టాండ్ దగ్గర చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు.. వైఎస్సార్‌సీపీ దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. ఇది కుప్పం చరిత్రలోనే చీకటి రోజని.. మనం ప్రజాస్వామ్యమంలో ఉన్నామా ..కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశామా అని ప్రశ్నించారు. చంద్రబాబు. పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.. పోలీసులు సీఎం చేతిలో కీలుబొమ్మలు మారిపోయారని మండిపడ్డారు.

ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూశాను కానీ ఇలాంటి వారిని చూడలేదన్నారు. బస్టాండ్‌లో దాడులు జరుగుతుంటే పోలీసులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం దారుణమని.. ఖబడ్దార్ మిస్టర్ జగన్ అంటూ సీరియస్ అయ్యారు. కుప్పం చోటామోటాలు కాదు.. దమ్ముంటే జగన్, పెద్దిరెడ్డి రావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ దగ్గర 60లక్షలమంది పోలీసులు ఉంటే.. తన దగ్గర 60 లక్షలమంది కార్యకర్తలు ఉన్నారన్నారు.