పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలిః రాజ్‌నాథ్ సింగ్

తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్కరే కాదు.. బిజెపి కూడా పోరాడింది.. రాజ్‌నాథ్ సింగ్

Tell why Telangana has not developed for ten years: Rajnath Singh

జమ్మికుంట : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ సమాజం, బిజెపి కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బిజెపి జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న తెలంగాణ అన్నారు. 1984లోనే బిజెపి రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన రెండింట ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారన్నారు.

గుజరాత్‌లో రెండున్నర దశాబ్దాలకు పైగా బిజెపి అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. కానీ పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కెసిఆర్ చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ఆరోపించారు.